Home | News Room | World Patient Safety Day

ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం " పురస్కరించుకొని అవగాహనా ర్యాలీని నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్

| Medicover Hospitals | Hyderabad

World Patient Safety Day

ఈ యొక్క అవగాహనా ర్యాలీ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి హైటెక్స్ వరకు మెడికేషన్ వితౌట్ హామ్’(Medication Without Harm) మరియు మెడికేషన్ సేఫ్టీ (Medication Safety) నినాదంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ శరత్ రెడ్డి - డైరెక్టర్ క్లినికల్ సర్వీసెస్ గారు జెండా ఊపి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్బంగా రోగి భద్రతకు పాటుపడతామని పాల్గొన్న 100 మంది సిబ్బంది ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తి, వారి జీవితంలో ఏదో ఒక సమయంలో అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది.ఆ అనారోగ్యాన్ని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి మందులు తీసుకుంటారు. అటువంటి అప్పుడు మనం వేసుకొనే మందులు తప్పుగా నిల్వ చేయబడినా, సూచించినా, పంపిణీ చేయబడినా లేదా తగినంతగా పర్యవేక్షించకపోయినా కొన్నిసార్లు తీవ్రమైన హానిని కలిగిస్తాయి.ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణలో నివారించదగిన హానికి అసురక్షిత మందుల పద్ధతులు మరియు మందుల లోపాలు ప్రధాన కారణం. బలహీనమైన మందుల వ్యవస్థలు మరియు అలసట, పేలవమైన పర్యావరణ పరిస్థితులు లేదా సిబ్బంది కొరత వంటి మానవ కారకాలు మందుల వినియోగ ప్రక్రియ యొక్క భద్రతను ప్రభావితం చేసినప్పుడు మందుల లోపాలు సంభవిస్తాయి. ఇది రోగికి తీవ్రమైన హాని, వైకల్యం మరియు మరణానికి కూడా దారి తీస్తుంది. కొనసాగుతున్న COVID-19 మహమ్మారి ఔషధ లోపాలు మరియు సంబంధిత ఔషధ సంబంధిత హాని ప్రమాదాన్ని గణనీయంగా పెంచింది. ఈ నేపథ్యంలోనే ‘మెడికేషన్ వితౌట్ హామ్’ నినాదంతో ‘మెడికేషన్ సేఫ్టీ’ని 2022 ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే థీమ్‌గా ఎంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ చీఫ్ మెడికల్ సర్వీసెస్ , సెంటర్ హెడ్ డాక్టర్ మాతా ప్రసాద్, డాక్టర్ అనూష- DMS పాల్గొన్నారు