Home | News Room

స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 12 వారాల గర్భిణీకి విజయవంతంగా చికిత్స అందించి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు

| Medicover Hospitals | Hyderabad

సోమాలియాకు చెందిన ఫదుమో మొహమ్మద్ ఒమర్ అనే 33 ఏళ్ల మహిళ 12 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు స్థానికంగా ఆమెకు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఉన్నది అని ఆమెకు డాక్టర్స్ తెలియచేసారు. క్యాన్సర్ థెరపీతో, తల్లి మరియు బిడ్డకు అధిక ప్రమాదం అని తెలియచేసారు.ఆమె మదిలో చాలా ప్రశ్నలు మొదలైయ్యాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేపించుకోకపోతే తనకి ప్రమాదం, చేయించుకుంటే కడుపులో ఉన్న బాబుకి ప్రమాదం అని ఆమెకు అర్థమైంది.

వెంటనే ఆమెకు తెల్సినవాళ్ల ద్వారా మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాద్విక్ రఘురాం గారిని కలవడం జరిగింది.డాక్టర్ ఆమెకు తన యొక్క పరిస్థితిని అర్ధం చేసుకొని ఆమెకు దైర్యం చెప్పి ఆమెకు ట్రీట్మెంట్ మొదలు పెట్టడం జరిగింది.రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీని మరియు ఆమె పుట్టబోయే బిడ్డను రక్షించడానికి మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఈ ఛాలెంజ్‌ని తీసుకుంది. మహిళకు కీమోథెరపీ చికిత్స అందించబడింది మరియు ఈ కీమో కోర్సులో, తల్లి మరియు పిండం యొక్క ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించారు. చివరగా, ఆమె అన్ని కీమో కోర్సులను విజయవంతంగా పూర్తి చేసింది మరియు ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది.

డాక్టర్ సాద్విక్ రఘురాం గారు మాట్లాడుతూ ఒకవేళ ఆమె నిర్లక్ష్యం చేసిఉంటే "క్యాన్సర్ శరీరమంతా వ్యాపించి చివరికి తల్లీ బిడ్డల మరణానికి దారితీసేది" అని అన్నారు.

తల్లితో పాటు బిడ్డని నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగాం.

అత్యంత క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితి నుండి తల్లి మరియు బిడ్డను రక్షించినందుకు డాక్టర్ సాద్విక్ రఘురాం గారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Dr Saadvik Raghuram Y

Dr Saadvik Raghuram Y

Sr. Consultant Medical
& Hemato Oncology