ఆసియాలో మొట్టమొదటి ట్రూబీమ్ ఐడెంటిఫై సిస్టమ్ & తెలంగాణా యొక్క మొదటి SGRT ను తెలంగాణ ప్రభుత్వం గౌరవ ఆరోగ్య & ఆర్థిక మంత్రి టి.హరీష్ రావు గారు ద్వారా ప్రారంభించబడింది.

7th November, 2022 | Medicover Hospitals | Telangana

యూరోప్‌లో అతిపెద్ద హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందిన, స్వీడన్‌కు చెందిన మెడికవర్‌ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన డాక్టర్స్, నూతన టెక్నాలజీ అందుబాటులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ & సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ జూలూరి గారు,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా హరికృష్ణ గారు, రేడియేషన్ ఆంకాలజి-HOD డాక్టర్ వినోద్ మద్దిరెడ్డి గారు పాల్గొన్నారు.

మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. మెడికవర్‌ లాంటి అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన సంస్ధ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం వల్ల మరింత మెరుగ్గా వైద్యసేవలు ప్రజలకు చేరువకాగలవని ఆశిస్తున్నాము అని అన్నారు. యూరోపియన్‌ ప్రమాణాలకు భారతీయ ఆరోగ్యసంరక్షణ నైపుణ్యం మిళితం చేసి మెరుగైన ఆరోగ్య సేవలను రాష్ట్ర ప్రజలకు మెడికవర్‌ కాన్సర్ ఇన్స్టిట్యూట్ అందించనుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దక్షిణభారతదేశంలోనే మెరుగైన వైద్యపరికరాలు - దక్షిణ భారత దేశంలోనే మొదటి TRU - BEAM రేడియేషన్ మెషిన్ మరియు ఆసియాలో మొదటి GEN 2 DISCOVERY IQ 4D పెట్- CT స్కాన్ మరియు SGRT - సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ మెషిన్ కలిగిన సెంటర్ ని ప్రాంభించినందుకు సంతోషంగాఉన్నది అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ జూలూరి గారు మాట్లాడుతూ ఇప్పుడున్న జీవనశైలిలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి కుటుంభం సంవత్సరానికి ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరు బాడీ స్క్రీనింగ్ చేయించుకోవాలి, తద్వారా మనం మొదటి దశలోనే వాటిని గుర్తించి వారికీ చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడగలం. ప్రజలకు అందుబాటులో దక్షిణ భారతదేశంలోనే నాణ్యమైన మరియు అత్యాధునిక అతి తక్కువ రేడియేషన్ కలిగిన పరికరాలు మరియు టెక్నాలజీతో క్యాన్సర్ వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో ఈ యొక్క కాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ప్రాంభించడం జరిగింది.

డాక్టర్ వినోద్ మద్దిరెడ్డి - HOD - రేడియేషన్ ఆంకాలజీ గారు మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోనే మొదటి TRU - BEAM రేడియేషన్ మెషిన్ మరియు ఆసియాలో మొదటి GEN 2 DISCOVERY IQ 4D పెట్- CT స్కాన్ మరియు SGRT మెషిన్ కలిగిన హాస్పిటల్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని అన్నారు. ఈ యొక్క క్యాన్సర్ మెషిన్స్ ఏ విదంగా పనిచేస్తాయి అంటే GEN 2 DISCOVERY IQ 4D పెట్- CT స్కాన్ ద్వారా తక్కువ రేడియేషన్ తో ఖచ్చితత్వంతో క్యాన్సర్ ని గుర్తిస్తుంది మరియు SGRT - సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ అనేది క్యాన్సర్ కణాలను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడానికి మరియు చంపడానికి త్రీ-డైమెన్షనల్ కెమెరా టెక్నాలజీని ఉపయోగించే ఒక బాహ్య బీమ్ రేడియేషన్ థెరపీ టెక్నిక్. చికిత్స సమయంలో, మీ శరీరం యొక్క ఉపరితలం నిజ సమయంలో ట్రాక్ చేయబడుతుంది మరియు మీ కణితి యొక్క స్థానం ఖచ్చితంగా లక్ష్యంగా ఉందని నిర్ధారించడానికి పర్యవేక్షిస్తుంది. మీ శరీరం ఆదర్శ స్థానం నుండి బయటికి వెళితే, SGRT చికిత్స స్వయంచాలకంగా పాజ్ చేస్తుంది మరియు మీ ఆరోగ్యకరమైన కణజాలాలను రేడియేషన్ నుండి కాపాడుతుంది. ముఖ్యమైన అవయవాలకు (గుండె , కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు మరియు కళ్ళు ) పక్కనే ఉన్న క్యాన్సర్లకు చికిత్స చేయడానికి SGRT ని ఉపయోగిస్తారు. దానివల్ల పక్కన ఉన్న అవయవాలకు హాని కలగదు అని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రతాపవర్మ, అశ్విన్,రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బాబయ్య ,డాక్టర్ రేష్మ,డాక్టర్ శ్రీలహరి, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాద్విక్ రఘురాం, డాక్టర్ శరత్ చంద్ర గోటేటి,డాక్టర్ హర్షవర్ధన్,క్లినికల్ హెమటాలజి స్థిత ప్రజ్ఞ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.