నెలలు నిండని పసికందుకు పునర్జన్మ 118 రోజులు మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యుల సంరక్షణ లో 710 గ్రాముల నుండి 2.1 కేజీల బరువు పెరుగుదల

Medicover Hospitals |

4 నెలల ముందు (24 వరాల ఆరు రోజులకి) ఒక గర్భిణీ మహిళ తీవ్రమైన కడుపు నొప్పి మరియు అధిక బ్లీడింగ్ తో హాస్పిటల్ కి రావడం జరిగింది మరియు దానికి తోడు గర్భంలో శిశువు ఎదురుకాళ్లతో ఉన్నాడు. ఆమెకి సర్జరీ చేయకపోతే తల్లి మరియు శిశువు ప్రాణాలకే ప్రమాదం.సాధారణంగా ఇలాంటి ముందస్తు గర్భధారణ సమయంలో శిశువు యొక్క ఊపిరితిత్తుల ఎదుగుదలకు తల్లికి స్టెరాయిడ్స్ ఇస్తాం. కానీ ఈ పేషెంట్ కు ఆ సమయం లేదు, త్వరగా డెలివరీ చేయవల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె ఒక బాబుకి జన్మనిచ్చింది. కేవలం 24 వారల 6రోజులలో (నాలుగు నెలల ముందు )పుట్టిన కారణం గా అతి తక్కువ బరువు & తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి . ఆ శిశువుకి సత్వర వైద్యం అందించి వెంటిలేటర్ సహాయంతో శ్వాసను అందించి ఇంక్యూబేటర్లో NICU కి మార్చారు. 10 రోజుల తర్వాత ఇంక్యూబేటర్ నుంచి బయటకుతీసి CPAP (కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్)తో శ్వాసను అందించారు, కొన్ని వారల తర్వాత ప్రెషర్ ను మెల్లగా తగ్గిస్తూ వచ్చారు. హై ఫ్లో నాసల్ కాన్యులా (HFNC ) ద్వారా కొన్ని రోజులు శ్వాసను అందించారు. తర్వాత శిశువు తనంతట తాను స్వంతంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. పుట్టిన 24 గంటల నుంచే శిశువుకి ఫీడింగ్ ఇవ్వడం జరిగింది. మధ్యలో శిశువుకి ఇన్ఫెక్షన్స్ రావడం జరిగింది, వాటిని కనుగొని యాంటిబయోటిక్స్ చికిత్స అందించారు మరియు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా అవసరం పడింది. వీటికి తోడు కామెర్లు రావడం జరిగింది. కామెర్లను ఫోటో థెరపీ ద్వారా నయం చేసారు.

శిశువుకి హార్ట్ లో డిఫెక్ట్ ఉండటం వలన రెండు డోసెస్ పారాసెటమోల్ ఇచ్చి దానికి చికిత్స చేయడం జరిగింది మరియు దీనికి తోడు బ్రెయిన్ స్కాన్ లో క్లాట్ లు కనిపించడం జరిగింది.డిశ్చార్జ్ సమయంలో బ్రెయిన్ స్కాన్ చేస్తే అంతా నార్మల్ గ ఉండటం జరిగింది. కన్ను , గుండె , మెదడు పనితీరుని ప్రతిరోజు పర్యవేక్షించారు.

డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె,HOD నియోనాటాలజీ మరియు పీడియాట్రిక్స్ గారు మాట్లాడుతూ శిశువు ఆరోగ్య సంరక్షణ మాకు , మా సిబ్బందికి ఒక సవాలు అనే చెప్పవచ్చు. అత్యాధునిక NICU సదుపాయాలు ఉండటం వలన ఇవన్నీ సాధ్యం అయ్యాయి. అయినప్పటికీ మా వైద్య , నర్సింగ్ సిబ్బంది చొరవతో పాపను కాపాడగలిగాం .దీనికి సహకరించిన వైద్య సిబ్బందికి , నర్సింగ్ సిబ్బందికి , శిశువు తల్లితండ్రులకు, ధన్యవాదాలు తెలిపారు.

Contributors

dr-janardhana-reddy-v

Dr Janardhana Reddy V

Consultant Pediatrician & Intensivist

dr-m-navitha

Dr M Navitha

Consultant Neonatologist & Pediatrician