Home | News Room | లివర్ క్లినిక్ ను ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

లివర్ క్లినిక్ ను ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

| Medicover Hospitals |

ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ T. రేణు కుమార్- చీఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారి చేతులమీదగా ఈ యొక్క క్లినిక్ ని రిబ్బన్ కట్ చేసి ప్రాంభించడం జరిగింది అనంతరం ఉచిత లివర్ ప్యాకేజీని ప్రారంభించారు .ఈ ప్యాకేజీ నందు - క్రియాటినిన్ , CBC , అల్ట్రాసౌండ్ , LFT మరియు ఉచిత కన్సల్టేషన్ అందించబడును. ఈ అవకాశం ఈ నెల 31 (31 ఆగష్టు 2022) వరకు మాత్రమే.

ఈ సందర్భంగా డాక్టర్ T. రేణు కుమార్- చీఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారు మాట్లాడుతూ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. గత కొన్నాళ్లుగా కాలేయ వ్యాధిగ్రస్తులు సంఖ్య క్రమేనా పెరుగుతున్నది .

శరీరంలో ఉన్న రెండో అతి పెద్ద అవయవం కాలేయం. ఇది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ఈ అవయవమే కీలకం.కాలేయం జబ్బు పడిన కూడా తనను తాను బాగుచేసుకోగలదు, శరీరానికి కావాల్సిన శక్తిని తయారు చేయగలదు.పావువంతు అవయవం బాగున్నా తనను తాను నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవం కాలేయం.కరోనా బారిన పడ్డవాళ్ళు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు.అందులో ఫ్యాటీ లివర్ సమస్యలు అధికం. అయితే, ఇండియాలో అత్యధిక ప్రజలు కాలేయ వ్యాధిబారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవ్వుతున్నట్లు గణంకాలు తెలుపుతున్నాయి. ఒకప్పుడు హెపటైటీస్ బీ, సీ వల్ల మాత్రమే కాలేయ సమస్యలు వచ్చేవి. అయితే, ఇప్పుడు మారుతున్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకుపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ప్రజలు కాలేయ సమస్య కొనితెచ్చుకుంటున్నారు.ఇది ఏ మాత్రం దెబ్బతిన్నా శరీరం అదుపు తప్పుతుంది.క్రానిక్ లివర్ డిసీజ్, అక్యూట్ లివర్ డిసీజ్ (క్రిటికల్ కేసులు) మరియు లివర్ క్యాన్సర్ కేసులు రోజురోజుకు 30-50 కొత్త కేసులు నమోదవుతున్నాయి.

డాక్టర్ శ్రీనివాస్ నిష్ఠల సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపాటాలజిస్ట్ గారు మాట్లాడుతూ ఫ్యాటీ లివర్ అనేది కాలేయం చుట్టూ కొవ్వు చేరడం వల్ల వస్తుంది. ఇది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఆల్కహాల్ రెండు నాన్ ఆల్కహాల్.అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీస్ వస్తుంది.ఒక వేళ మద్యం తాగకపోయిన ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తుంటే దాన్ని నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీస్ అంటారు.ఈ సాధారణ కాలేయ వ్యాధి 5 - 20 శాతం భారతీయులని ప్రభావితం చేస్తుంది అని అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ బిశ్వబసు దాస్ - డైరెక్టర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ గారు మాట్లాడుతూ కాలేయం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కింది విధంగా పేర్కొన్నారు.చేయకూడనివి :

  • 1. మద్యానికి దూరంగా ఉండండి. అతిగా తాగడం వల్ల లివర్ దెబ్బతింటుంది.
  • 2. కొవ్వు పదార్థాలు, వేపుళ్లు అతిగా తినొద్దు.
  • 3. ఉప్పు, చక్కెరలు ఎక్కువ మొతాదులో తీసుకోవడం ప్రమాదకరం.
  • 4. ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను తినవద్దు.
  • 5. బీఫ్, పంది, మేక (రెడ్ మీట్) మాంసాలను అతిగా తినొద్దు.

ఇలా చేయండి:

  • 1. పచ్చని ఆకుకూరలు తినండి. ఇవి లివర్‌ను శుభ్రంగా ఉంచుతాయి.
  • 2. సల్ఫర్ ఎక్కువగా ఉండే వెల్లులి పాయలు లివర్‌ను కాపాడతాయి.
  • 3. పసుపు కాలేయానికి మేలు చేస్తుంది. గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు సైతం కాలేయానికి మంచివే.
  • 4. మంచి కొవ్వులను తీసుకోండి. ఆలీవ్ ఆయిల్, వాల్ నట్స్, అవకడోస్‌లు కాలేయాన్ని శుభ్రం చేస్తాయి.
  • 5. విటమిన్-సి ఎక్కువగా తీసుకోండి. ఇది కాలేయం వద్ద కొవ్వులను నియంత్రిస్తాయి.
  • 6. రోజు నీటిని ఎక్కువ తాగడం. దీనివల్ల కాలేయాన్ని ఆరోగ్యం ఉంచుతుంది.

ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ డాక్టర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు .